ఆదిపురుష్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే ?

బాహుబలి స్టార్ ప్రభాస్ ఇప్పుడు వర్షం సినిమాలో చేసి బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా కాగా మరొకటి బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం లోని ఆదిపురుష్. అయితే నాగ అశ్విన్  సినిమా కంటే ఆదిపురుష్ సినిమా నుంచి ఎక్కువగా అప్డేట్ వస్తున్నాయి.

ఏకంగా ఈ రోజు ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారో కూడా అనౌన్స్ చేసి షాకిచ్చారు మేకర్స్. ఈ సినిమా 2022 ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నాం అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దాని మీద ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. టి సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్, నిర్మిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ కు రెండేళ్ల టైం పెట్టారు అని కూడా అంటున్నారు చూడాల్సి ఉంది.

 

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)