‘NTR30’లో మరో బాలీవుడ్ స్టార్ నటుడు

-

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోని మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త ప్రాజెక్టు ఇటీవలే  పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

ఈ కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్, ప్రకాష్ రాజ్ , జాన్వీ కపూర్ తదితరులు హాజరయ్యారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘NTR 30’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఇప్పటికే సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ యాడ్ అయినట్లు ట్వీట్ చేసింది. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలియజేస్తూ ఫోటోలను పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news