ఆమెదో తిండి రోగం.. రోజుకు కిలో వెన్న తినేసి, లీటర్ నూనె తాగితే కానీ ప్రశాంతంగా ఉండదట..!

-

మనం ఎంత కష్టపడినా.. అది కడుపునిండా తినడానికే. అయితే చాలా మందికి ఫుడ్‌ విషయంలో పెద్దగా ఇష్టాఇష్టాలు ఉండవు.. ఏదో ఒకటి తింటారు.. కానీ కొంతమంది ఫుడ్‌ లవర్స్‌ ఉంటారు.. వీళ్ల ధ్యాస అంతా ఫుడ్‌ మీదే ఉంటుంది. ఇష్టమైన ఆహారం కోసం ఎంత దూరమైన వెళ్తారు. కానీ ఈ మహిళది వేరే పరిస్థితి.. ఈమెకు ఉందో వ్యాధి.. దీనివల్ల..రోజుకు కిలో వెన్న తినేసి, లీటర్ నూనె తాగేస్తోంది. దీన్ని ఈటింగ్‌ డిజార్డర్‌ అంటారు. వీళ్లు పైకి బానే కనిపిస్తారు.. తినే విషయంలోనే వీళ్ల రోగం బయటడపడుతుంది.

ఫ్రెంచ్‌కు చెందిన ఓ మహిళ ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతోంది. ఆమె రోజు కిలో వెన్న తింటూ, లీటర్ నూనె తాగేస్తోంది. ఇలా కొన్ని సంవత్సరాలుగా చేసోందట.. వీటితో పాటు చాక్లెట్లు, నూనెలో వేయించిన వేపుళ్లు అధికంగా తింటోంది. ఇలా తినడం వల్ల తనకు మానసిక ఆందోళన తగ్గుతోందని, అందుకే తింటున్నానని చెబుతోంది. ఆమె వయసు 24 ఏళ్లు. ఆమె ఈటింగ్ డిసార్డర్‌కు ఎలాంటి చికిత్స తీసుకోకపోగా, తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఇలానే కొనసాగిస్తానని చెబుతోంది.

ఏమిటి ఈ తినే రుగ్మత?

‘బింగే ఈటింగ్ డిసార్డర్’… ఇది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారు తమని తాము నియంత్రించుకోలేరు. అధిక మొత్తంలో ఆహారాన్ని తింటారు.. ఎంత తింటున్నారో కూడా వారికి లెక్క ఉండదు.. అతిగా తినేసి వాంతులు, వికారం బారిన పడతారు. తినే ఆహారం అధికమైతే ఊబకాయం బారినపడి అనేక రోగాలు వస్తాయి. మానసికంగాను వీరు కుంగిపోతారు. ఇలా అతిగా తినే జబ్బు ఉంటే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది..

లక్షణాలు ఎలా ఉంటాయి?

బింగె ఈటింగ్ డిసార్డర్ వ్యాధి బారిన పడినవారు అతిగా తింటారు.
బరువు పెరుగుతున్నామన్న స్పృహ వారికి ఉండదు.
అధికంగా తిన్నాక ‘అయ్యో అనవసరంగా ఎక్కువ తినేసామే’ అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు.
ఇతరులతో కలిసి తినడానికి ఇష్టపడరు. తాము ఒంటరిగా కూర్చుని తింటూ ఉంటారు.
నిర్దిష్టమైన పాత్రలను మాత్రమే వాడతారు. రోజుకో పాత్ర వాడడం వారికి నచ్చదు.
తినేశాక వాంతులు చేసుకుంటారు లేదా తిన్న వెంటనే బాత్రూంకి వెళ్తారు.
మానసిక ఆందోళన బారిన పడతారు. ఎప్పుడూ చిరాగ్గా ఉంటారు.
భోజనం తింటున్నప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు.
ఇలాంటి వారికి ఏకాగ్రత ఉండదు.
త్వరగా అలసిపోతారు.
తల తిరగడం వంటివి కలుగుతాయి.
వ్యాయామం కూడా విపరీతంగా చేస్తూ ఉంటారు.
ఇవన్నీ బింగే ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు. వీటిలో రెండు మూడు ఉన్నా కూడా వెంటనే వైద్యులను కలవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news