మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

-

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు మాన‌సికంగా సిద్ధ‌ప‌డాలి. ఈ క్ర‌మంలోనే అందుకు ఎలా సిద్ధ‌మ‌వ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భ‌య‌ప‌డొద్దు

జాబ్ పోతుంద‌నగానే చాలా మంది భ‌యానికి లోన‌వుతుంటారు. అలా చేయ‌కూడ‌దు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా, ధైర్యంగా ఉండాలి. జాబ్ పోతే ఆదాయం వ‌చ్చే మార్గం పోతుంది. క‌నుక ఇలాంటి స్థితిలో చాలా మంది తీవ్ర‌మైన భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతుంటారు. కానీ అలా కాకుండా ధైర్యంగా ఉండాలి. ఆందోళ‌న పనికిరాదు. ఆదాయం వ‌చ్చే మార్గాల‌ను అన్వేషించాలి. అలాగే వేరే కంపెనీల్లో జాబ్‌ల‌కు అప్లై చేయాలి. ఈ జాబ్ పోతే జీవితం ముగిసిన‌ట్లే అనుకోకూడ‌దు. డిప్రెష‌న్‌కు లోను కాకూడ‌దు. కొత్త జాబ్ సంపాదిస్తాం అన్న ధీమాతో ఉండాలి. అందుకు ప్ర‌య‌త్నాలు చేయాలి.

2. సూచ‌న‌లు గ‌మ‌నించాలి

సాధార‌ణంగా కొన్ని కంపెనీల్లో ఉద్యోగం ఉంటుందా, పోతుందా.. అనే విష‌యం ముందుగానే తెలుస్తుంది. క‌నుక ఆ సూచ‌న‌లు గ‌మ‌నించాలి. కంపెనీ ప్ర‌గ‌తి ఎలా ఉంది, ఆదాయం ఎలా ఉంది, కొత్త రిక్రూట్‌మెంట్స్ ఉన్నాయా, జీతాలు పెంచుతున్నారా.. వంటి విష‌యాల‌ను గ‌మ‌నిస్తే కంపెనీ లాస్‌లో ఉందీ, లేనిదీ తెలుస్తుంది. ప్రాఫిట్‌లో ఉంటే దిగులు చెందాల్సిన ప‌నిలేదు. మీ జాబ్ క‌చ్చితంగా ఉంటుంది. అదే కంపెనీ లాస్‌లో ఉంటే అల‌ర్ట్ అవ్వాలి. కొత్త జాబ్ కోసం య‌త్నించాలి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియ‌దు క‌నుక‌.. అందుకు ప్రిపేర్డ్ గా ఉండాలి. అది పోయే లోపే ఇత‌ర ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేయాలి. దీంతో స‌డెన్ గా ఉద్యోగం నుంచి తీసేసినా ఇబ్బంది పడాల్సిన ప‌ని ఉండ‌దు.

3. స్కిల్స్, రెజ్యూమ్ అప్‌డేట్

ప్ర‌స్తుతం ఉన్న కంపెనీలో ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు మీ రెజ్యూమ్‌ను అప్‌డేటెగ్ గా ఉంచుకోవాలి. దాంతో ఇత‌ర కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ ప‌డితే వెంట‌నే జాబ్‌కు అప్లై చేసి ఉద్యోగం సాధించ‌వ‌చ్చు. అలాగే ఉద్యోగులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ స్కిల్స్ ను మెరుగు ప‌రుచుకోవాలి. ఇత‌ర కోర్సులు చేయాలి. జాబ్ కు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవ్వాలి. దీంతో ఒక కంపెనీలో ఉద్యోగం పోయినా మ‌రొక కంపెనీలో ఉద్యోగం సుల‌భంగా ల‌భిస్తుంది.

4. ఎక్కువ‌గా య‌త్నించాలి

మీరిప్పుడు ప‌నిచేస్తున్న కంపెనీలో ఉద్యోగుల‌ను తీసేస్తున్నా, తీసేక‌పోయినా.. మార్కెట్‌లో మీ జాబ్ డిస్క్రిప్ష‌న్‌కు త‌గిన విధంగా ఎక్కువ శాల‌రీని ప‌లు కంపెనీలు ఆఫ‌ర్ చేస్తుంటాయి. అందువ‌ల్ల జాబ్ సైట్ల‌లో, కంపెనీల‌కు చెందిన సైట్ల‌లో అలాంటి ఆఫ‌ర్ల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు చూస్తుండాలి. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగం క‌న్నా బెట‌ర్ అయిన ఉద్యోగాల కోసం ఎక్కువ‌గా య‌త్నించాలి. దీంతో ఎప్పుడూ ఉద్యోగాల వేట‌లో ఉండ‌వ‌చ్చు. ఒక కంపెనీలో జాబ్ పోయినా మ‌రొక కంపెనీలో జాబ్‌ను సులభంగా పొందేందుకు చాన్స్ ఉంటుంది.

5. ట్రెండ్స్ ను ప‌రిశీలించాలి

మార్కెట్‌లో ప్ర‌స్తుతం మీ జాబ్ డిస్క్రిప్ష‌న్‌కు త‌గిన విధంగా ఉద్యోగాల ట్రెండ్ ఎలా ఉందో ప‌రిశీలించాలి. మీరు చేస్తున్న లాంటి ఉద్యోగాల‌ను ఇత‌ర కంపెనీలు ఆఫ‌ర్ చేస్తున్నాయా, లేదా ఇత‌ర ఉద్యోగాలు ట్రెండింగ్‌లో ఉన్నాయా, వాటిని పొందేందుకు ఏం చేయాలి.. అన్న మార్గాల‌ను అన్వేషించాలి. మీ జాబ్‌కు త‌గిన‌ట్లుగా ట్రెండింగ్‌లో ఉన్న జాబ్‌ల‌ను ఎంచుకోవాలి. వాటిల్లో నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స్కిల్స్ ను అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌డెన్‌గా జాబ్ పోయినా బెంగ‌ప‌డాల్సిన ప‌ని ఉండ‌దు. వెంట‌నే మ‌రో ఉద్యోగం క‌చ్చితంగా దొరుకుతుంది. అందువ‌ల్ల జాబ్ పోతుందేమోన‌ని భ‌య‌ప‌డ‌కుండా, అందుకు ముందుగానే మాన‌సికంగా సిద్ధంగా ఉండి.. పైన తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే.. స‌డెన్ జాబ్ లాస్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version