తెలంగాణ లో మళ్ళీ పులి టెన్షన్ ?

తెలంగాణలో మరోసారి టెన్షన్ మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి  మండలం లో కర్ణ గూడెం, రాయి గూడెం గ్రామ సమీప అడవుల్లో, పంట పొలాల్లో పులి సంచరించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులిని పట్టుకునేందుకు పులి సంచరించిన ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. కర్ణ గూడెం గ్రామానికి చెందిన కొమరం సత్యనారాయణ అనే రైతు ఎద్దు పై పులి దాడి చేసి చంపింది.

దీంతో ఇప్పటివరకు ప్రజల అపోహ గా  భావించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచరిస్తున్న విషయం గత నెల రోజులుగా ప్రచారం జరుగుగుతుంది. కొన్ని రోజులు గుండాల మండలంలో, మరికొన్ని రోజులు బయ్యారం మండలంలో సంచరించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా పులి ఆనవాళ్లు కనపడకపోవడంతో అవాస్తవ ప్రచారం అనుకొని ఫారెస్ట్ అధికారులు వదిలేశారు. కానీ పులి అడుగులు కనపడటం, ఎద్దులు చంపడం రెండు కారణాలతో పులి కచ్చితంగా తిరుగుతుందన్న గట్టి నమ్మకంతో ఫారెస్ట్ అధికారులు పులి పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.