తెలంగాణలో మళ్ళీ పులుల టెన్షన్ మొదలైంది. కొమురం భీం జిల్లాలో మొత్తం ఆరు పులుల సంచారం ఉన్నట్లు చెబుతున్నారు. పెంచికల్ పేట, బెజ్జూర్, దహేగాం, మండలాల్లో పులుల సంచారం టెన్షన్ రేపుతోంది. బెజ్జూర్ చెరువు దగ్గర పులి అడుగులు గుర్తించిన అధికారులు మహారాష్ట్ర నుంచి కొత్తగా మరో పులి కూడా వచ్చినట్లు గుర్తించారు. పులులు వలన ప్రజలు భయాందోళనలో ప్రజలు ఉన్నారు.
జిల్లాలో పెంచికల్‌పెట్, బెజ్జూర్, దహెగాం మండలాల్లో ఆరు పులులు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 16 పులులు ఉండగా.. నాలుగు పులులు మంచిర్యాల జిల్లాకు వెళ్లాయని, మరో పులి జన్నారం కవ్వాల్ అడవుల్లోకి పోయినట్లుగా, మిగతావి తడోబాకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో పులుల టెన్షన్ వీడడం లేదని చెప్పాలి.