ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సిఆర్డిఏ చట్టాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడం పట్ల జగన్ కి వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సి ఆర్ డి ఎ చట్టం రద్దు చేయడం పట్ల హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీఆర్డీఏ రద్దు చట్టాన్ని అమలు చేసిన బిల్లును సస్పెండ్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ సందర్భంగా బిల్లు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులను ప్రతివాదులుగా పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు కూడా కోర్టును ఆశ్రయించారు.
ఇటీవల వైఎస్ జగన్ సర్కార్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన బిల్లులు ఆమోదం కోసం మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈరోజుతో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే జరిగిన సమావేశాల్లో ఆమోదముద్ర పొందిన వికేంద్రీకరణ బిల్లు అదేవిధంగా సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదముద్ర పొందటంతో తాజాగా ఈ రెండు విషయాలు హైకోర్టు దృష్టికి వెళ్లడంతో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.