కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడి : రూ.3వేల స్కాం పై ఆరా !

-

కార్వీ కేసులో ఈడి అధికారులు దూకుడు పెంచారు. కార్వీ సంస్థల పైన విస్తృతంగా సోదాలు చేస్తున్న ఈ డి.. 16 చోట్ల కార్వీ సంస్థ ల పై సోదాలు చేసింది. హైదరాబాద్ లోని కార్వీ దానికి సంబంధించిన పది అనుబంధ సంస్థల్లో సోదాలు నిర్వహించింది ఈడీ. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరు, చెన్నై ,ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఈ డి… కార్వీ సంస్థపై ఇప్పటికే కేసు నమోదు చేసింది.

కార్వీ చైర్మన్ పార్థసారథిని ఇప్పటికే మూడు రోజుల పాటు విచారించిన ఈడీ….మూడు వేల కోట్ల రూపాయల నిధుల గోల్మాల్ పై ఆరా తీస్తోంది. కార్వీ ఇప్పటికే సిసిఎస్ లో ఐదు కేసులు నమోదు చేసారు ఈడీ అధికారులు. ఇక కార్వీ చైర్మన్ పార్థ సారథి ఇంటి తో పాటు ఇప్పటి కే అరెస్టయిన 5 గురి ఇళ్లల్లో సోదాలు చేసింది ఈ డి. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను సేకరించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఈ కేసును విచారణ చేస్తున్నారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news