ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటే.. విద్యాధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. అయితే.. పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి చేతన్ సింగ్ జౌరామాజ్రాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫదీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీకి తనిఖీ కోసం వెళ్లిన మంత్రి చేతన్ అక్కడ అధికారులతో దురుసుగా వ్యవహరించారు. హాస్పిటల్‌లో ఉన్న బెడ్లను పరిశీలించిన ఆయన.. అవి పాడైపోవడాన్ని చూసి వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా ధ్వంసమైన బెడ్లపై ఎలా పేషెంట్లు పడుకుంటారని వీసీని మంత్రి నిలదీశారు. నాసిరకం బెడ్‌పై పడుకోవాలంటూ ఆ అధికారిని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు భయపడ్డ ఆ వర్సిటీ వీసి ఓ బెడ్‌పై పడుకున్నాడు. మంత్రి చేతన్ ప్రవర్త పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన మెడికల్ స్టాఫ్‌ను మానసికంగా నిర్వీర్యం చేస్తోందని విపక్షాలు విమర్శించాయి.