ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నీటితో కలకలలాడుతున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలతో పాటు పైనుండి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువన ఉన్న ప్రాజెక్టు నుంచి 1,06,750 క్యూసెక్కుల వరద వస్తుండగా..51,481 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.20 అడుగుల నీరు నిల్వ ఉంది.
కుడి ఎడమ జర విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు నాగార్జునసాగర్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. పైనుంచి ప్రాజెక్టులోకి 44,769 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని.. జలాశయం నుంచి 3, 2004 క్యూసెక్కుల వరద దిగువకి వెళుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 554.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది.