అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’..కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ కాలంలో బాగా పాపులర్ అయింది. సిరీస్, సినిమాలు ఆహా ఒరిజినల్స్ తెలుగు ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘ఆహా’ తన సామ్రాజ్యాన్ని ఇతర భాషల్లోకి విస్తరించుకుంటున్నది.
తమిళ భాషలోకీ ‘ఆహా’ను విస్తరింపజేయాలని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించాయి. ‘ఆహా’ తమిళ్ ఓటీటీని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆవిష్కరించనున్నారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ‘నూరు శాతం తమిళ ఓటీటీ’ గా ‘ఆహా’ ప్రసారాలను ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆహా నిర్వాహకులు ట్వి్ట్టర్ వేదికగా విడుదల చేశారు.
గురువారం సాయంత్రం 5.30 గంటలకు చెన్నై లీలా ప్యాలెస్‌లో ఈ ఈవెంట్ జరుగుబోతోంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్ అయిన సినిమాలను, వెబ్ సీరిస్ లను, ఓటీటీ మూవీస్‌ను కూడా తమిళ ‘ఆహా’లో ప్రసారం చేయబోతున్నారు. ఆహా నిర్వాహకులు అల్లు అరవింద్, మై హోమ్ రామేశ్వర రావు త్వరలో దక్షిణ భారతదేశంలోని మిగిలిన రెండు భాషల్లోనూ ‘ఆహా’ ప్రసారాలు విస్తరించే ఆలోచన చేస్తున్నట్లున్నారు.
After the phenomenal journey in Telugu, @ahavideoin is launching in Tamil today with Hon. CM of Tamilnadu as chief guest.@ahatamil#AlluAravind #JupallyRamuRao pic.twitter.com/ShLcvrlf0n
— Vamsi Kaka (@vamsikaka) April 14, 2022