AI linked City: ఏఐ మిమ్మల్ని గమనిస్తోంది..ఈ వ్యవస్థ కల్గిన తొలి నగరంగా కీలక ప్రాంతం

-

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా గుజరాత్ లోని అహ్మదాబాద్‌ లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి తీసుకువచ్చారు.అయితే దీని ద్వారా భద్రత, పరిశుభ్రత,ట్రాఫిక్ ను పర్యవేక్షించడం వంటి అంశాలను మానిటరింగ్ చేస్తారు. అంతేకాకుండా పోలీసు విభాగంలో కూడా ఉపయోగించనున్నారు.

 

ఈ క్రమంలో పాల్ది ప్రాంతం ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ కేంద్రానికి నిలయంగా మారడంతో అహ్మదాబాద్‌తోపాటు దాని పరిసర ప్రాంతాలు ఏఐ పరిధిలోకి రానున్నాయి.ఈ నిఘా వ్యవస్థ కోసం డ్రోన్స్‌ను కూడా ఉపయోగించనున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతాలు, బస్సుల్లో కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ద్వారా ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర గుర్తించలేని కార్యకలాపాలను మానిటరింగ్ చేయవచ్చు.తప్పిపోయి వారిని గుర్తించడంతో పాటు చోరీ వంటి సంఘటలను సులభంగా గుర్తించవచ్చు. అక్రమ పార్కింగ్, చెత్త పేరుకుపోవడం ఇతర పౌర సమస్యలను కూడా గుర్తించడంలో ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news