Hanuman Movie : క్రేజీ అప్‌డేట్.. మెగాస్టార్ చేతుల మీదుగా హనుమాన్ సెకండ్ ట్రైల‌ర్….?

-

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఈ చిత్రము జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్, టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉండి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 7 న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంది.తెలుగుతో పాటు తమిళం, కన్నడ,హిందీ,మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్, చైనీస్ ,స్పానిష్, కొరియన్ వంటి పలు భాషల్లో హనుమాన్ గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news