జియో విజయవంతమైన స్థాయిలో ఏఐను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. ఎన్విడియా సమ్మిట్ లో జెన్సెన్ తో ఆయన ముఖాముఖిలో చర్చించారు. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ.. “విద్య అంటే సరస్వతి.. విద్యను దేవతగా మేము కొలుస్తుంటాం. ఎప్పుడైతే నీకు నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావో.. జ్ఞాన దేవతకు నిన్ను నువ్వు అర్పణం చేసుకుంటావో అప్పుడే సంపదకు నెలవైన లక్ష్మీదేవి నిన్ను వరిస్తుందని భావించడం మా సంప్రదాయం” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మనం ఒక కొత్త ఇంటెలిజెన్స్ యుగం ద్వారం వద్ద ఉన్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా 8 బిలియన్ల ప్రజలందరికీ శ్రేయస్సును అందిస్తుంది. ప్రస్తుతం మీరు నడిపిస్తున్నది కూడా ఇదే. వాస్తవానికి ఇదే మా మొదటి నియమం కూడా. ఈ ఇన్‌ఫర్మేషన్ యుగాన్ని తీసుకురావడంలో మీరు చేసిన ప్రయత్నాలు అభినందనీయం” అని జెన్సన్ తో చెప్పారు. అలాగే డివైజ్ అప్ గ్రేడేషన్ అవసరం లేకుండా హై క్వాలిటీ ఏఐ సేవలను ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని చెప్పారు అంబానీ.