రైతుల నిరసన నుండి AIKSCC, BKU (Bhanu) తప్పుకోవడానికి కారణం ఇదే ..!

-

ఢిల్లీ లో రైతులు నిరసన కొనసాగుతున్న సంగతి తెలిసినదే. అయితే కొనసాగుతున్న రైతుల నిరసన నుండి ఈరోజు రైతులు వైదొలిగినట్లు అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (AIKSCC) మరియు భారతీయ కిసాన్ యూనియన్ (Bhanu) ప్రకటించాయి. అయితే దీనికి గల కారణాలు ఏమిటి…? అనే విషయానికి వస్తే.. గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ట్రాక్టర్లతో నిరసన చేసారు. ఆ తీరులో నిరసన చెయ్యడం అసంభవం అని రెండు రైతు సంఘాలు వెల్లడించాయి. అలానే తమ సంస్థ రైతుల నిరసన నుండి తక్షణమే తప్పుకుంటున్నట్టు అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ నాయకుడు వి.ఎం. సింగ్ చెప్పారు.

ఇది ఇలా ఉండగా ఈ ఆందోళనను నిలిపివేస్తున్నాము కానీ రైతుల కోసం పోరాటం మాత్రం ఆగదు అని AIKSCC నాయకుడు VM సింగ్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఆందోళన ఆగిపోతుంది అంటే పోరాటం ఆగిపోయినట్టు కాదని వెల్లడించారు. అలానే గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ట్రాక్టర్ మార్చ్ కి తమ సంస్థకి ఎటువంటి సంబంధం లేదని AIKSCC నాయకుడు VM సింగ్ చెప్పారు.

భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికైట్ నేతృత్వంలోని నిరసనతో తనకు ఎలాంటి సంబంధం లేదని విఎం సింగ్ తెలిపారు. రాకేశ్ టికైట్ అనుసరణ లో అది జరిగిందన్నారు. అయితే వేరొకరి ఆదేశాల తో జరుగుతున్న నిరసన లో మేము ముందుకి వెళ్లలేమన్నారు. వాళ్ళు ముందుకి వెళ్లాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని విఎం సింగ్ అన్నారు. ఈ కారణాల చేత విఎం సింగ్ మరియు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ ఈ నిరసన నుండి వెంటనే తప్పుకుంటున్నట్టు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news