మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

-

మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని కోస్గి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటలు కొనుగోళ్లు చేస్తామని స్పష్టం చేశారు. కుటుంబం ఆర్థికంగా బాగుపడాలంటే నగదు ఆడబిడ్డల చేతుల్లోనే ఉండాలి అని తెలిపారు. మగవారికి ఇస్తే సాయంత్రం బెల్ట్ షాపుల్లో ఖర్చు పెడతారు అని అన్నారు. భవిష్యత్తులో సున్నా వడ్డీ విధానాన్ని అమలు చేస్తాం. మిమ్మల్ని లక్షాధికారి కాదు.. కోటీశ్వరుల్ని చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని తెలిపారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొడంగల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి….. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేపట్టారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు . అలాగే మెడికల్‌, నర్సింగ్‌, డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు,దామోదర రాజనర్సింహ, స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news