కంగువా మూవీ డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో సూర్య !

-

శివ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ .భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా తాజాగా డబ్బింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్తగా ప్రారంభించిన ప్రొడక్షన్ స్టూడియో అద్నాలో ‘కంగువ’ డబ్బింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ ‌ వీడియో, కంగువ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కంగువ లో దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది .బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.నటుడు సూర్య సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news