టాటాల చేతికి ఎయిర్ ఇండియా..

-

ఉప్పు నుంచి కార్ల దాకా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న టాటా గ్రూప్ చేతికి ఇక ఎయిర్ ఇండియా వెళ్లబోతోంది. ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఏయిర్ ఇండియా ప్రైవేటు పరం కానుంది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రభుత్వం అమ్మాలని ఎప్పటి నుంచో చూస్తోంది. దీని కోసం ఓపెన్ బిడ్లను ఆహ్వానించిది. టాటా సన్స్ గ్రూపు, స్పైస్ జెట్ బిడ్లను దాఖలు చేశాయి. అయితే దీంట్లో ఎక్కువ మొత్తం కోట్ చేసి టాటాలు ఏయిర్ ఇండియాను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టాటాలకు గతంలో, ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో అనుభవం ఉంది. స్వాతంత్య్రానికి ముందే 1932 లో టాటాలు ఇంపీరియర్ ఏయిర్ వేస్ పేరుతో సంస్థను నెలకొల్పారు. స్వాతంత్య్రం తర్వాత ఇదే ఎయిర్ ఇండియాగా మారింది. ప్రస్తుతం మళ్లీ టాటాల చేతికే ఏయిర్ ఇండియా వెళ్లింది. ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వం చేతిలో ఉన్న 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లయింది. ప్రభుత్వం చెప్పిన ఎమౌంట్ కన్నా దాదాపు రూ. 3వేల కోట్లు ఎక్కువకు బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియాను టాటాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం టాటాలు విస్తారా ఏయిర్ లైన్స్ లో షేర్లు కలిగి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version