ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. జీ5 స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితం..

-

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రూ.289 పేరిట ఎయిర్‌టెల్ కొత్త ప్ర‌వేశ‌పెట్టిన ప్లాన్‌ను క‌స్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకుంటే దాంతోపాటు జీ5 యాప్‌కు ఉచిత స‌బ్‌స్క్రిప్ష‌న్ పొంద‌వ‌చ్చు. ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. దీని వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

airtel gives free zee5 subscription with this new prepaid plan

అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు క‌నుక జీ5 స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా 28 రోజుల పాటు ఉచితంగా వ‌స్తుంది. ప్లాన్ వాలిడిటీ ముగిశాక మ‌ళ్లీ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే తిరిగి ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను 28 రోజుల పాటు ఉచితంగా పొంద‌వ‌చ్చు. అంటే.. ఎల్ల‌ప్పుడూ జీ5 స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా కావాలంటే ఈ ప్లాన్‌ను నెల నెలా క‌స్ట‌మ‌ర్లు రీచార్జి చేసుకోవాల‌న్న‌మాట‌.

ఇక ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రిన్ని స‌దుపాయాలు కూడా ల‌భిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీం ప్రీమియం సేవ‌లు, ఉచిత హ‌లోట్యూన్స్‌, వింక్ మ్యూజిక్‌కు యాక్సెస్‌, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు, ఫాస్టాగ్ తీసుకుంటే రూ.150 క్యాష్‌బ్యాక్ త‌దిత‌ర ఆఫర్లు ల‌భిస్తాయి. ఇక ఎయిర్‌టెల్‌కు చెందిన రూ.249తోనూ దాదాపుగా ఇలాంటి స‌దుపాయాలే ల‌భిస్తాయి. అయితే అందులో అన్‌లిమిటెడ్ కాల్స్ రావు. కానీ రూ.289 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news