దేశంలోని టెలికాం కంపెనీలు యూజర్లకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా ఎయిర్ టెల్ మరోసారి తన సొంత యూజర్లకు షాక్ ఇచ్చింది.మరోసారి రీచార్జి ప్లాన్లను సవరించినట్లు తెలుస్తోంది. గతంలో రూ.509 రీచార్జ్ ప్లాన్‌లో ఇంటర్ నెట్‌తో పాటు 84 రోజుల పాటు ఉచిత కాల్స్, 900 ఎస్‌ఎంఎస్‌లు చేసుకునే అవకాశం కల్పించింది.
కానీ, ఇప్పుడు ఆ ప్లాన్‌ను ఎయిర్ టెల్ సవరించింది. రూ.509తో ఇప్పుడు రీచార్జ్ చేస్తే 84 రోజుల పాటు కేవలం ఉచిత కాల్స్, 900 ఎస్ఎంఎస్‌లు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అనగా ఇంటర్నెట్ ప్లాన్‌ను ఈ రీచార్జి టారిఫ్ నుంచి తొలగించారు. ఈ ఆఫర్ కేవలం డ్యూయల్ సిమ్స్ వాడుకునే వారికి మాత్రమే యూస్ ఫుల్‌గా ఉండనుంది.ఈ ప్లాన్ ఛేంజ్ కావడంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.