Aishwarya Rajesh: చీర కట్టులో వావ్ అనిపిస్తున్న ఐశ్వర్య రాజేష్

-

ఐశ్వర్య రాజేష్ ఈ పేరు తెలియన వారుండరు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు కన్నా తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువగా రాణిస్తోంది. పాత్ర ఏదైనా సరే బెటర్ ఫెర్ఫామెన్స్ ఇవ్వడంలో ఐశ్వర్యా రాజేష్ కు పేరుంది. మంచి పాత్ర దొరకాలే కానీ తన నటనతో ఇరగదీస్తుంది. 

కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం నటిగా నిలదొక్కుకుంది. ఇటు నటనకు అవకాశం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ పాత్రలకు కూడా ఓకే చెబుతోంది ఈ అమ్మడు. 

తెలుగులో నటించిన ‘ వరల్డ్ ఫేమస్ లవర్‘, టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేకపోయాయి. కానీ ఐశ్వర్యకు మాత్రం నటిగా మంచి మార్కులు పడ్డాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య తన గ్లామర్ తో మత్తెక్కిస్తోంది. చీర కట్టులో వావ్ అనిపించేలా ఉంది. ఐశ్వర్య అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చీర కట్టులో తన సోయగాలను చూసి మైమరచిపోతున్నారు.  

ప్రస్తుతం తెలుగులో ఐశ్వర్యకు పెద్దగా సినిమా అవకాశాలేవి లేవు. కానీ తమిళం, మళయాళం భాషల్లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తెలుగు అమ్మాయి అయినా తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు.

తమిళంలో డ్రైవర్ జమున, మోహన్ దాస్, దగ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాల్లో నటిస్తోంది. ఇక మళయాళంలో హర్, పులిమాడ సినిమాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version