పంజాబ్ లో నడిరోడ్డుపై కాల్పులు.. అకాలీదళ్ నేత మృతి

-

పంజాబ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్ లోని మొహాలీ ప్రాంతానికి చెందిన అకాలీదళ్ యువనేత విక్రమ్ జిత్ సింగ్ కిద్దుకురెను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు… అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సెక్టర్ 71 లోని ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసుకు వెళ్లిన విక్రమ్ జీత్ తిరుగు ప్రయాణంలో భాగంగా తన కారు లోకి ఎక్కువ ఉన్న సమయంలో దుండగులు అటాక్ చేశారు.

నలుగురు వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇద్దరు ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత విక్రమ్ జిత్ ఏకంగా 500 మీటర్లు పరిగెత్తాడు. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో.. sector 71 లోని కమ్యూనిటీ సెంటర్ వద్ద కుప్పకూలిపోయాడు విక్రమ్ జీత్. విక్రమ్ జితు పై ఏకంగా 15 బుల్లెట్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరా లలో రికార్డయింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. నిందితుల కోసం  గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version