క్షీణించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్‌లోని ప్రముఖ ఆస్పత్రికి తరలింపు..

496

ఎంఐఎం సీనియర్ నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిసింది. ఆయన అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని సమాచారం. గతంలో ఒకసారి చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన విషయం విదితమే. అయితే ఆ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. అయినప్పటికీ ఆ గాయాల కారణంగానే ఇప్పుడు అక్బరుద్దీన్ అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది.

అయితే అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తుండే సరికి ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాగా అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఆయన్ను లండన్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తన సోదరుడు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.