పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలి : అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Join Our COmmunity

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని అంటూ వ్యాఖ్యానించారు. 4,700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదని ఆయన అన్నారు.  అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటున్నారు కదా అలా అయితే  హుస్సేన్‍సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలని ఆయన వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదు – ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలి మాకు బాగా తెలుసు అంటూ ఆయన టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఇక ముషీరాబాద్ భోలక్ పూర్ లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ముషీరాబాద్ వార్డ్ నెంబర్ 86 ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ నీ స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...