గ్రేటర్ ఎన్నికల్లో నేర చరిత్ర గల అభ్యర్థులు చిట్టా ఇదే !

-

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల లిస్ట్ ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ విడుదల చేసింది. పోటీలో ఉన్న నేర చరిత్ర గల అభ్యర్థులు 49 మంది ఉన్నారు. వారిపై నమోదైన కేసుల సంఖ్య 96 దాకా ఉంది. అత్యధికంగా బీజేపీ నుంచి 17 మంది నేరచరితులు బరిలో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది బరిలో ఉన్నారు.

ఎంఐఎం నుండి 7 గురు బరిలో ఉన్నారు. నేర చరిత్ర కలిగిన మహిళ అభ్యర్థులు 6 గురు ఉన్నారు. ఇక 41 వార్డులలో నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరి డివిజన్ కి వచ్చే సరికి ప్రధాన పార్టీలన్నీ కూడా నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ కేటాయించారు.  గత ఎన్నికల్లో 72 మంది నేర చరితులకు టికెట్ ఇస్తే ఈ సారి కేవలం 49 మందికి మాత్రమే ఇవ్వడం శుభ పరిణామం అనే చెప్పాలి. 

 

Read more RELATED
Recommended to you

Latest news