akanda : ఓటీటీలోనూ ‘అఖండ’ రికార్డుల మోత..మొదటి సినిమాగా చరిత్ర

-

టాలీవుడ్‌ సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 2 విడుదలై.. అఖండ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటిన ఈ అఖండ సినిమా జనవరి 21 వ తేదీన ఓటీటీ లో రిలీజ్‌ అయింది. అయితే.. ఓటీటీలోనూ… రికార్డులను సృష్టిస్తోంది అఖండ మూవీ.

ఓటీటీలోకి వచ్చి 24 గంటలు గడవక ముందే ఈ సినిమా మిలియన్‌ స్ట్రీమింగ్స్‌ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య డబుల్‌ రోల్‌ చేసిన సంగతి విధితమే. ముఖ్యంగా అఘోరా గెటప్‌ కారణంగానే ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుంది. అఘోరా గెటప్‌ లో బాలయ్య కనిపించే ప్రతిసారి తమన్‌ తన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తో సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేశౄరు. ఇక ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్‌ కనివిందు చేయగా.. శ్రీకాంత్‌, జగపతి బాబు, పూర్ణ కీలక పాత్రలో అందరినీ ఆకట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version