పరకాల వార్: చల్లా వర్సెస్ కొండా.. తగ్గేదేలే!

-

ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడుతున్న చల్లా, కొండా ఫ్యామిలీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య హాట్ హాట్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడుతున్న సమయంలోనే…చల్లా అనుచరులు కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని పాక్షికంగా  ధ్వంసం చేశారు. ఇక దీనిపై కొండా మురళి, సురేఖలు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అలాగే కొండా ఫ్యామిలీ అనుచరులు ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ధర్మారెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని వార్నింగ్‌లు ఇస్తున్నారు.

అయితే ఇంత రచ్చ జరగడానికి కారణం వచ్చి… ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతర నిర్వహణకు కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. ఈ పాలకవర్గం చేత ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన జాతర ప్రాంగణాన్ని పరిశీలించగా, అక్కడ ఉన్న  మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపంపై చర్చ వచ్చింది. గద్దెల వద్ద  స్థూపాలు ఉండటం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో, అక్కడ మీటింగ్ అయిపోయాక టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా చెబుతున్న వ్యక్తి స్థూపాన్ని పాక్షికంగా ధ్వంసం చేశాడు. దీన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఇక ఈ విషయం కొండా ఫ్యామిలీకి తెలిసింది. దీంతో ఎమ్మెల్యేపై కొండా ఫ్యామిలీ విరుచుకుపడుతుంది. ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఫైర్ అవుతున్నారు. ఇలా పరకాలలో పోలిటికల్ హీట్ పెరిగింది.

అయితే గత ఎన్నికల్లో పరకాలలో చల్లాపై కొండా సురేఖ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఎలాగైనా చల్లాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సురేఖ పనిచేస్తున్నారు. పరకాలలో కాంగ్రెస్ శ్రేణులు కూడా దూకుడుగా ఉన్నాయి. ఎలాగైనా చల్లాని ఓడించాలని చూస్తున్నాయి. ఈ సంఘటనతో మరింతగా చల్లాని ఓడించాలనే కసి కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో పరకాల రాజకీయం మరింత హీటెక్కేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version