అక్కినేని అఖిల్‌కు అస్సలు కలిసి రావట్లేదు. ఇండస్ట్రీలోకి స్టార్ హీరో హోదాలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అనుకున్నంత సక్సెస్ ఇప్పటి వరకు రాలేదు. మొదటి మూడు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో మనోడి మీద అభిమానులకు కాన్ఫిడెన్స్ పోతుంది. అయితే ఈ సారి పక్కాగా హిట్ కొట్టేందుకు ప్లాన్ వేసుకుంటున్నాడు.
ఇదే క్రమంలో స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఈ సినిమా పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో మరోసారి స్క్రిప్టు పనులపై ఫోకస్ పెట్టింది టీం.
ఇందులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి భావిస్తున్నాడంట. ఎందుకంటే కొన్ని సీన్లలో కమిట్‌మెంట్ సరిగ్గా లేదని, అది హీరోకు నెగెటివ్ షేడ్ తీసుకొచ్చేలా ఉండటంతో దాన్ని మార్పు చేయాలనుకుంటున్నాడు. మార్పు చేయాలంటే కనీసం 3నెలలైనా పడుతుంది. ఈ లోగా కరోనా సెకండ్‌వేవ్ కూడా కంట్రోల్ అవుతుందని మూవీ టీం అంచనా వేస్తోంది. మరి ఈ మార్పులు అఖిల్‌కు కలిసొస్తాయా లేదా చూడాలి.