Most Eligible Bachelor: ముహూర్తం ఖ‌రారు! ద‌స‌రాకు రానున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌

-

Most Eligible Bachelor: అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రం నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వ‌స్తుంది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిస్తూ ఈ చిత్రాన్ని క్రేజీ ప్రొడ్యూస‌ర్ బన్నీ వాసు, మరో ప్రొడ్యూస‌ర్‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ మోస్ట్ క్రేజీ కాంబీనేష‌న్ తో వ‌స్తున్న‌ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌, పాట‌లు, అలాగే టీజ‌ర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో ఈ చిత్ర‌యూనిట్‌లో కొత్త ఉత్సాహం వెల్లువిరించింది. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందించిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 15న థియేటర్స్‌లో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చాలా ఇంపార్టెంట్ .. ఎందుకంటే చాలా కాలంగా అఖిల్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో నైనా స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి మ‌రీ!

Read more RELATED
Recommended to you

Latest news