రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట లో చాకలి ఐలమ్మ 126 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి హరీష్ రావు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సిఎం కేసిఆర్ కృషి చేస్తున్నారన్నారు.
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని… చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు హరీష్ రావు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరి కి గర్వ కారణమని… అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు మంత్రి హరీష్‌రావు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి ని పుణి కి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని గుర్తు చేశారు హరీష్ రావు.