దేవుడికి సమర్పించే పూలు హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనవి వీటిని ఎక్కడ వేయాలి ఎలా ఉపయోగించాలి అనేది భక్తులకు ముఖ్య ప్రశ్నగా మారింది. పూర్వకాలంలో అయితే పూలను దేవునికి ఉపయోగించిన తర్వాత నదిలోను చెరువుల్లోనూ బావుల్లోను పడేసేవారు. కానీ సిటీలలో ఇల్లు అపార్ట్మెంట్లలో ఉండేవారు దేవుడికి ఉపయోగించిన పూలను డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందేమోనని భయపడేవారు ఉన్నారు. మరి దేవుడి పూలని ఎక్కడ వేయాలి. వాటి పవిత్రతను కాపాడే విధానాలను తెలుసుకుందాం..
హిందూ ఆచారాల్లో పూజలో ఉపయోగించిన పూలు దైవ సమర్పణగా భావిస్తారు. ఈ పూలు దేవుడి ఆశీస్సులను తీసుకువస్తాయని నమ్ముతారు అందుకే వీటిని గౌరవంగా భక్తిగా చూస్తారు. పూలను విసిరి వేయడం లేదా అనుచిత ప్రదేశాల్లో ఉంచడం అశుభం గా పరిగణిస్తారు.
ఎక్కడ ఉంచాలి:పవిత్రమైన చెట్టు కింద ఉంచడం ఉత్తమం. ఇది పర్యావరణానికి ఆధ్యాత్మికతకు సానుకూలంగా ఉంటుంది. లేదా రెండు రోజులకు ఒకసారి ఇంటిలోని దేవుడికి సమర్పించిన పూలను సమీపంలోని నది, సరస్సు, కాలువల్లో పడి వెయ్యవచ్చు. ఇది వాటి పవిత్రతను కాపాడుతుంది. ఇక అంతేకాక పూల ను కంపోస్ట్ గా మార్చి ఇంట్లోని తోటలో ఉపయోగించవచ్చు ఇది పర్యావరణహితం.

ఎక్కడ వెయ్యకూడదు : దేవుడి పూలను చెత్తలో వేయడం అశుభం. మురికి ప్రదేశాల్లో బాత్రూం, రోడ్లు అపవిత్రంగా ఉండే ప్రదేశాల్లో పడవ వేయకూడదు. పూలను గౌరవంగా ఉంచే ప్రదేశంలోనే వేయాలి కాలితో తొక్కేచోట బురద మురికి కాలవల్లో వేయకూడదు.
పూజ అయిన పూలను శుభ్రమైన గిన్నెలో సేకరించి వెంటనే సరైన ప్రదేశంలో ఉంచాలి. ప్లాస్టిక్ లేదా ఇతర అపవిత్రత వస్తువులలో కలిపి బయట వేయకూడదు. దేవుడి పూలను పవిత్రంగా భావించి భక్తి తో చెట్ల కింద లేదా నీటిలో కంపోస్ట్ గా ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని సాంప్రదాయాన్ని కాపాడవచ్చు.