మీ నమ్మకాన్ని నిలబెట్టే వరకూ నిద్రపోను…అఖిల్ ఎమోషనల్..!

అక్కినేని వారసుడు అఖిల్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి కూడా సూపర్ హిట్ కాలేదు అన్న సంగతి తెలిసిందే. దాంతో అక్కినేని అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇక అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగ్గా నాగచైతన్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ… అఖిల్ ఎమోషనల్ అయ్యారు. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న అక్కినేని అభిమానులందరికీ ఏ సిచువేషన్ లో అయినా నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిమానులందరికీ చెబుతున్నా…నేను ఎక్కువ మాట్లాడను ఒకటే చెప్తాను మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను. నాకు నిద్ర రాదు…. నేను నిద్ర పోలేను. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. అంటూ అఖిల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పై అఖిల్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సినిమా అఖిల్ కు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.