మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు : తెలుగు రాష్ట్రాల్లో రూ. 110 క్రాస్‌ !

మన దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటగా… డీజిల్ ధరలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న చమురు ధరల తో… సామాన్య ప్రజలు చుక్కలు చూస్తున్నారు. అంతేకాదు పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు వాహనదారులు.

Petrol and Diesel
Petrol and Diesel

తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ పై 30 పైసల్‌ మరియు లీటర్‌ డీజిల్‌ పై 35 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.8 కు చేరగా డీజిల్ ధర రూ. 92.47 కు పెరిగింది.

అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108. 02 కు చేరగా డీజిల్ ధర రూ. 100. 89 కు పెరిగింది. ముంబై లో రూ. 109.83 , కు చేరగా డీజిల్ ధర రూ. 100.29 కు పెరిగింది. కోల్ కతాలో రూ . 104.23 కు చేరగా డీజిల్ ధర రూ. 95.58 కు పెరిగింది. చెన్నైలో రూ .101.27 కు చేరగా డీజిల్ ధర రూ. 96.93 కు పెరిగింది.ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110. 31 కు చేరగా డీజిల్ ధర రూ. 102. 61 కు చేరుకుంది.