బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో… బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాణ సారధ్యంలో అఖిల్ హీరోగా వస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే… తన కాళ్ళతో అఖిల్ చెవులను టచ్ చేస్తూ ఉంటుంది.
విడుదల అయిన కాసేపటికే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.
Revealing the Quarantine life of our Bachelor & Bachelorette🤩🧡 #MostEligibleBachelor @AkhilAkkineni8 @hegdepooja @Baskifilmz @GopiSundarOffl #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/jTY40OeV4R
— Geetha Arts (@GeethaArts) July 29, 2020