కాళేశ్వరం ప్రాజెక్ట్​లో ప్యాకేజీలకు దేవుళ్ళ పేర్లు ఖరారు..!

-

కాళేశ్వరం ప్రాజెక్ట్ 27, 28 ప్యాకేజీలకు దైవాల పేర్లు పెట్టిన ప్రభుత్వం. 27వ ప్యాకేజీకి లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకంగా నామకరణం. 28వ ప్యాకేజీకి శారదాదేవి ఎత్తిపోతల పథకంగా పేర్లు ఖరారు. ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిన నీటిపారుదల శాఖ. 50వేల ఎకరాలకు సాగునీరు అందించనున్న లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్న శారదాదేవి ఎత్తిపోతల పథకం.

Kaleswaram project
Kaleswaram project

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు హైదరాబాద్​ నుంచి తెలంగాణ టూరిజం బస్సులు నడుపుతుంది. ప్రత్యేక ప్యాకేజీ బ్రోచర్​ను పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సచివాలయంలో కొన్ని నెలల క్రితం ఆవిష్కరించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరును అందించే మేడిగడ్డ జలాశయం, కాళేశ్వరం ప్రాజెక్టును చూడాలని చాలా మంది ఆశపడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ ఆనకట్ట, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం ఆనకట్ట, భద్రాద్రి ఆలయం కలుపుతూ ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం పర్యాటక సంస్థ బస్సులు నడుపుతున్నదని చెప్పారు. అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో త్వరలోనే బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టునూ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news