హ్యాండ్ శానిటైజర్ల నిల్వ, అమ్మకాలకు లైసెన్స్‌లు తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ… ప్రజలకు మరింత విస్తృతంగా శానిటైజర్లు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ హ్యాండ్ శానిటైజర్ల నిల్వ, అమ్మకాల లైసెన్స్‌లను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు మరింత విస్తృతంగా హ్యాండ్ శానిటైజర్స్ అందుబాటులో ఉండేలా చూడడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ నిబంధనల నుంచి హ్యాండ్ శానిటైజర్ల నిల్వ, అమ్మకాలకు మినహాయింపు ఇచ్చింది. జులై 27న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే చిల్లర వ్యాపారులు… ఈ శానిటైజర్ ఉత్పత్తులను గడువు ముగిసిన తరువాత విక్రయించకూడదని, నిల్వ చేయరాదని తేల్చిచెప్పింది.హ్యాండ్ శానిటైజర్లను అమ్మకపు లైసెన్స్ అవసరం నుంచి మినహాయించాలని పలు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.