అఖిల ప్రియకి బిగిసిన ఉచ్చు..ఆధారాలు అన్నీ వెల్లడించిన పోలీసులు !

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ ప్రధాన నిందితురాలు అని తేల్చేశారు పోలీసులు. మొత్తం ప్లాన్ చేయడం నుండి దానిని అమలు పరిచే దాకా ఆమె అన్ని విషయాల్లోనూ ఇన్ వాల్వ్ అయినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన దానికి సంబంధించి పూర్తీ వివరాలు వెల్లడించారు. ఈ కిడ్నాప్ కోసం వీరు ఆరు సిమ్ లు కొనుగోలు చేసినట్టు పోలీసులు ఆధారాలతో వెల్లడించారు.

అలానే కిడ్నాప్ కేసులో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ రెడ్డి కాగా మరొకరు బోయా సంపత్ కుమార్ (22) ఈయన భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్ అని, అలానే అఖిల ప్రియ డ్రైవర్ బాల చెన్నయ్య అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని అంజనీ కుమార్ పేర్కొన్నారు. మూడు మొబైల్ ఫోన్స్ , ఫేక్ నెంబర్ ప్లేట్స్ స్వాధీనం చేసున్నామని ఆయన పేర్కొన్నారు.