తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తానే వెళ్లి కలుస్తానని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఇరువురి మధ్య బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో స్పందించిన అఖిలేష్ జనవరి 7 తరువాత కేసీఆర్‌ను హైదరాబాద్‌లోనే కలుస్తానని అఖిలేష్ పేర్కొన్నారు. డిసెంబర్ 25, 26 తేదిల్లో ఆయనను కలవాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఫెడరల్ ఫ్రెండ్ దిశగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. ఆ దిశగా మరిన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో తెరాస విజయం సాధించిన తర్వాత తొలి సారి దేశంలోని పలు రాజకీయ పక్షాలను కలిసేందుకు కేసీఆర్ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే ఆయన ఇటీవల ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్‌ను కలవాల్సి ఉండగా…కొన్ని కారణాల వల్ల తాను నేడు ఢిల్లీకి వెళ్లలేక పోతున్నానని…త్వరలోనే హైదరాబాద్ లో తానే స్వయంగా కేసీఆర్ తో భేటీ కానున్నట్లు వివరించారు. నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా రాష్ట్రాలను ఏకం చేసే పనిలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యహరించడాన్ని కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.