Naga Chaitanya:రానా బాటలో చైతూ.. ఆ రోల్స్‌కు కూడా సిద్ద‌మే..

-

Naga Chaitanya: టాలీవుడ్ లో యంగ్ న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. క్యారెట‌ర్ ఎలాంటిదైన స‌రే రెడీ అవుతున్నారు. సరైన సినిమా పడితే విలన్‌గా మెప్పించడానికి కూడా సిద్ధమవుతున్నారు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రానా దగ్గుబాటి.. బాహుబలి సినిమాతోపాటు ఓ హిందీ సినిమాలో విలన్‌గా మెప్పించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీలోనూ విలన్ క‌నిపించ‌నున్నాడు. యువ హీరో..కార్తికేయ కూడా గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా మెప్పించాడు. త‌మిళ్‌లోనూ అవ‌కాశాలు వ‌స్తాయి.

ఇప్పుడూ.. అదే కోవ‌లో అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్య కూడా నడవనున్నాడు. త్వ‌ర‌లో నెగిటివ్ షేడ్‌లో న‌టించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. వ‌రుస సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా పూర్తి అయ్యింది. ఈ నెల 24 న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

మ‌రోవైపు.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమా చిత్ర నిర్మాణం జ‌రుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీ లోనూ హ‌వా చాట‌నున్నారు. అమీర్ ఖాన్ న‌టిస్తున్నలాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నా చైతూ ఇప్పుడూ.. ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నాడు . విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించనున్నాడట. లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్స్ సంబంధించిన‌ ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నానని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news