నెల్లూరు లో విషాదం.. ఒకే కుటుంబం లో ముగ్గురు ఆత్మ హత్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట లో తీవ్ర విషాదం చోటు చేసు కుంది. ఒకే కుటుంబం లో ఏకంగా ముగ్గురు ఆత్మ హత్య చోటు చేసుకున్నారు. ఈ తీవ్ర విషాదం.. గురు వారం రోజు ఉదయం పూట చోటు చేసు కుంది. ఇక ఈ ఘటన తో స్థానకంగా కలకలం రేపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. సూళ్లూరు పేట దొరవారిసత్రం మండలం మోదుగుల పాళెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు.

నిన్న అర్థ రాత్రి ఆత్మ హత్య చేసుకోగా.. ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. మెర్లపాక మురళి, అమ్మ మస్థానమ్మ, కూతురు కావ్య అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు. అయితే ఇందులో కొడుకు లోకేష్ ఆచూకీ తెలియ లేదు. అతడు ఎక్కడికి వెళ్లాడో ఎవరికి సమాచారం లేదు. ఇక వీరు ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నారనే దాని పై ఎలాంటి క్లారిటీ లేదు. భార్య మీద మనస్థాప తో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.