డ్యాన్స‌ర్‌తో అక్కినేని హీరో రొమాన్స్‌…!

-

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించబోయే చిత్రం కోసం అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవితో జ‌త క‌ట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆగష్టు 25 నుండి నాగ చైతన్య, సాయి పల్లవి రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటార‌న్న‌ టాక్ ముందు వినిపించింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జ‌రుపుకుంటున్న‌ ఈ చిత్రం సెప్టెంబర్ 5 నుండి షూట్ ప్రారంభమవుతుంద‌ట‌.

Akkineni NagaChaitanya Romance With sai pallavi

అయితే నాగ చైతన్య తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ గా నటిస్తుందని శేఖర్ కమ్ముల వెల్లడించారు. గ‌తంలో శేఖర్ కమ్ముల మరియు సాయి పల్లవి ఇద్దరూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్ `ఫిదా` చిత్రంలో క‌లిసి ప‌ని చేశారు. ఆ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇంకా చెప్పాలంటే ఫిదా సాయిప‌ల్ల‌వి కెరీర్‌ను మార్చేసింది. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల మంచి డాన్స్ బేస్డ్‌ లవ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

మ‌రి డ్యాన్స‌ర్‌గా సాయి ప‌ల్ల‌విని ఈ సారి ఏ రేంజులో చూపిస్తాడో ? ఆమెతో చైతు రొమాన్స్ ఎలా ఉంటుందో ? చూడాలి. అలాగే నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాత‌లు. ఈ సినిమాను అతి తక్కువ టైమ్ లో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం నాగ చౌత‌న్య `వెంకీ మామ‌` చిత్రంతో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు సాయి ప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` చిత్రంలో రానాతో న‌టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version