అభిజితో కలిసి హంగామా చేసిన అక్కినేని సమంత …. ఎందుకో తెలుసా…!?

15 వారాలు, 16 మంది ఇంటి సభ్యులు, ముగ్గురు, వైల్డ్ కార్డు ఎంట్రీ లు అనేక టాస్క్లు, రిలేషన్లు, వివాదాలు,గొడవలు, కొట్లాటలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని నాలుగు గోడల మధ్య…అది పెద్ద బిగ్ బాస్ హౌస్ లో. అందులో ఉన్నటువంటి టాస్క్ లా మజా అంతా ఇంతా కాదు. మొత్తానికి చివరికి మిగిలింది ఐదుగురు కంటెస్టెంట్ లు మాత్రమే. ఆదివారం రాత్రి గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. విజేత ఎవరో తెలియబోతుంది . మొత్తానికి వంద రోజుల పాటు ఓకే హౌస్ లో ఉండటం అంటే ఆషామాషీ కాదు. నిజంగా ఇది సాధారణమైన విషయం కాదు . పైగా టీవీ లు ఉండవు చేతిలో సెల్ఫోన్ లో ఉండవు . ఇంట్లో ఉండే మనుషుల తోటి పిచ్చాపాటీ చేయాల్సి ఉంటుంది. వాళ్లతోనే మాట్లాడాలి, వాళ్లతోనే తినాలి,వాళ్లతోనె గొడవ పడాలి. మళ్లీ వాళ్లతోనే సర్దుకుపోవాలి… అన్నీ అక్కడే. గొడవలు, వివాదాలు సద్దుమణిగేలా చూసుకోవాలి . ఇదంతా చాలా కష్టమైన పని. మొత్తానికి ఇవన్నీ దాటుకుని ఐదుగురు ఇంటి సభ్యులు టాప్ ఫైవ్ లో కి చేరారు. ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు ప్రత్యేక పెర్ఫార్మెన్స్ లు చూపించారు. దీంతో వీరు ఐదుగురు టాప్ ఫైవ్ లో నిలిచారు.

samantha

కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు అందరికీ దూరంగా వంద రోజుల పాటు విడిగా ఉన్నారు . వీటన్నిటిని ఫాలోఅప్ చేస్తూ బిగ్బాస్ సీజన్ ఫోర్ ఫైనల్ కంటెస్టెంట్స్ లో ఒకడి గా టైటిల్ రేసులో బెస్ట్ పార్ఫార్మన్స్ ఇచ్చాడు అభిజిత్. హౌస్ నుంచి బయటకు రాగానే అక్కినేని వారి కోడలి సమంత తో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ షో ముగిశాక ఫైనల్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ విన్నర్,రన్నర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బిగ్బాస్ తెచ్చిపెట్టిన ఫేమ్, యూట్యూబ్ చానల్స్ మరియు మీడియా చానల్స్ ఎందులో చూసిన వాళ్ళే కనిపిస్తారు. వాళ్లకు రేటింగ్స్, వీళ్లకు ఫ్రేమ్ …అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఇరువురికి ఉపయోగకరంగా ఉంటుంది.

అందుకే బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ తో స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తుందట అక్కినేని వారి కోడలు. ఆహా ఓటిటి వేదికగా ప్రసారమయ్యే సామ్ జామ్ ప్రోగ్రాం కోసం అభిజిత్ ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జాం ప్రోగ్రాం కు ప్రేకక్షలను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాతో ఎంజాయ్మెంట్ మాములుగా ఉండదు అంటూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది సమంత. మొత్తానికి అక్కినేని వారి కోడలు ఇప్పుడు ఆహలో అదరగొడుతోంది అనే చెప్పలి సామ్ జాం ప్రోగ్రాంలో. ఈ సమయం లో బిగ్ బాస్ ఫినిష్ కాగానే అభిజిత్ ఇంటర్వ్యూ కోసం అన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. భారీగా ఫన్ క్రియేట్ చేస్తూనే ఆయనకు సంబంధించిన అన్ని వ్యక్తిగత అంశాల్లతోపాటు ప్రేక్షకులకు తెలిసేలా ఏర్పాట్లు చేశారట. ఇదే జరిగితే సమంత తో ఎంజాయ్ చేసిన మొదటి బిగ్ బాస్ కాంటాస్టెంట్ అభిజిత్ అవ్వటం విశేషం. ఆ క్షణం కోసం అభిజిత్ ఫాన్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు.