సాక్షి రంగారావు కొడుకు పెద్ద నటుడు… ఎవరో తెలుసా…!?

-

టాలీవుడ్ చిత్ర సీమ లో ప్రముఖ నటుడు సాక్షి రంగారావు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఆయనే సాక్షి రంగారావు.సెప్టెంబర్ 15 1942వ సంవత్సరంలో గుడివాడ సమీపంలోని కొండిపర్రు గ్రామములు లక్ష్మీనారాయణ రంగనాయకమ్మ అనే దంపతులకు రంగా వరుసుల రంగారావు జన్మించారు. ఆయన విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీ లో స్టెనోగ్రాఫర్ గా కొన్నేళ్ళుగా పనిచేశారు. అప్పటికి ఆయనకి కళలు అంటే చాలా ఇష్టమ్. ఈ ఆసక్తి ఆయన్ను ఉద్యోగం చేస్తునే మరో వైపు స్టేజి మీద నాటకాలు వేసేలా చేసింది. ఆలా ఆయన రంగస్థలం మీద డైలాగ్స్ చెప్పే తీరు అందరిని ఆకట్టుకుంది. ప్రేక్షకులు మంత్రం ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఓ రోజు దర్శకుడు బాపు రమణ రంగారావు ప్రతిభను గుర్తించారు. దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో కర్ణం అనే పాత్రను ఆయనకు ఇచ్చారు. అప్పటికే రంగారావు కి 25 సంవత్సరాలు. మొదటి సారిగా వచ్చిన పాత్రను అద్భుతంగా నటించి వావ్ అనిపించుకున్నారు ఆయన.

.1967 లో విడుదల అయినా ఈ చిత్రం రంగారావు అసలు పెరైనా రంగవ్వస్సులను సాక్షి గా మార్చేసింది. హీరోయిన్ బానుమతి మాత్రం సాక్షి రానగరావు అని, పసుపుకొమ్ము అని సరదాగా పిలుస్తుండేవారు. ఆమె నటించిన మట్టిలో మాణిక్యం అనే సినిమాలో సాక్షి రంగరావు విలన్ గా నటించి అందరిని మెప్పించాడు. తన కెరీర్ మొత్తం లో 450 చిత్రాల్లో ఆయన నటించారు. సహాయ నటుడుగా, కమిడియన్ గా, విలన్ గా… ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా అనేక విభిన్నమఐనా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరించారు . ముఖ్యoగా ఆయన పోషించిన కెమెడి పాత్రలు ఇప్పటికి అందరిని కడుపుబ్బ నవ్విస్తుంటుంది.1986జంధ్యాల తెరకేక్కించిన
రెండు రెండ్ల ఆరు లో సాక్షి రంగారావు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో 150 కిల్లోమిటర్ల వేగం తో మాట్లాడాలని జంధ్యాల చెప్పారట . ఓకే అనేసిన సాక్షి సూపర్ ఫాస్ట్ గా డైలాగ్స్ చెప్పి శబ్బాష్ అనిపించుకున్నాడంట. ఆయన నటించిన చివరి సినిమా స్వరాభిషేకం. 2005 మే 5 నా గురజాడ వారి నాటకం కన్యాషుల్కమ్ నాటకం లో గిరీషం పాత్రకు ఆయన రిహరసల్స్ చేస్తూ ఉన్నారు. ఈ సమయం లో గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కి తరలించిన తర్వాత తుది శ్వాస విసిచారు. జూన్ 27 2005 లో 63 సంవత్సరాల వయస్సులో ఆయన తుది శ్వాస విడిచారు.

అయితే ఆయన కుమారుడు కూడా చిత్ర సీమలో ఒక అద్భుతమైన నటుడునే విషయం చాలా మందికి తెలియదు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ఆయన చిన్న కుమారుడు సాక్షి శివ. ఆయన 250 సినిమాల్లో నటించారు. ఆయన ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న … టీవీ సీరియల్స్ లో తండ్రి పాత్రలో అల్లరిస్తూనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news