దుమ్ము రేగిపోయిన త్రివిక్రమ్ స్పీచ్ !!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో. ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ హైదరబాద్ లో గొప్పగా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. జనవరి 12న ఈచిత్రం విడుదలకానుంది. అయితే దీనికి పోటీగా మహేశ్ బాబు సరిలేరు చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఈ చిత్ర బృందం కూడా హైదరబాద్ లోనే ప్రీ రిలీజ్ ని పూర్తి చేసుకున్నారు.

 

ఇప్పుడు అల్లూ అర్జున్ యూసఫ్ గూడా లోని గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ని ప్లాన్ చేసి తమన్ తో రఫ్ ఆడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ..ఈ సినిమాకి సంగీతం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా బన్నీ గురించి మాట్లాడుతూ పెళ్లికాకముందు నుండి అల్లు అర్జున్ తో సినిమాలు చేయడం జరిగింది ఉన్న కొద్దీ బన్నీ లో మెచ్యూరిటీ లెవెల్ రోజురోజుకూ పెరుగుతున్నాయి అంటూ మాట్లాడారు. అంతేకాకుండా ఈ వేడుకకి ‘మ్యూజికల్ కన్సర్ట్’ అనే పేరు రావడానికి కారణం అల్లు అర్జున్ అని సినిమాకి సగం హిట్..మ్యూజిక్ వల్ల వచ్చేసిందని డైరెక్టర్ త్రివిక్రమ్ తెలిపారు.

 

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి..పొగడ్తల వర్షం కురిపించిన త్రివిక్రమ్..కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ…ప్రత్యేకంగా ‘సామజవరగమన’ సాంగ్ గురించి మాట్లాడి సినిమాకి ఇటువంటి సెన్సేషన్ రావడానికి కారణం ఇదే అంటూ త్రివిక్రమ్ పాట పాడిన వారికి రాసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సినిమాలో అల్లు అర్జున్ పిల్లలు కూడా నటించడంతో అల్లు అర్జున్ భార్య కి కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు త్రివిక్రమ్. టోటల్ గా ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ కన్సర్ట్ ద్వారా సినిమాకి పని చేసిన ప్రతి సంగీత కళాకారులకు గౌరవం అందించేలా వేడుక చేశారు సినిమా యూనిట్.

Read more RELATED
Recommended to you

Latest news