హైదరాబాద్ వాసులకు అలర్ట్…8న ఈ ప్రాంతాల్లో నీటిసరఫరా బంద్..!

-

హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. ఈ నెల 8న నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. ఉదయం ఆరు గంట‌ల నుండి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కూ నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోనుంది. హైద‌రాబాద్ కు నీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న క్రిష్ణా డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై ప్రాజెక్టు ఫేజ్ 1కు సంతోష్ న‌గ‌ర్ కు వాట‌ర్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో జంక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే హైద‌రాబాద్ లోని స‌న‌త్ న‌గ‌ర్, సైదాబాద్, మీరాలం, విన‌య్ న‌గ‌ర్, సంతోష్ న‌గ‌ర్, చంచ‌ల్ గూడ, ఉస్మాన్ బాద్, అస్మాన్ గ‌ఢ్‌, యాకుత్ పురా, రియాస‌త్ న‌గ‌ర్, మాద‌న్న‌పేట, బొగ్గుల‌కుంట‌, అడిక్ మెట్, న‌ల్ల‌కుంట‌, చిల‌క‌ల గూడ‌, దిల్ సుఖ్ న‌గ‌ర్ ప్రాంతాల్లో న‌టీస‌ర‌ఫ‌రా బంద్ కానుంది. కాబ‌ట్టి ఈ ప్రాంతాల‌లోని వాసులు ముందురోజే స‌రిపోయే నీటిని ప‌ట్టుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version