పిల్లలు ఒమీక్రాన్ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

-

కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అందరినీ ఒమీక్రాన్ భయపెడుతోంది. మీ చిన్నారులు ఈ వైరస్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అనుసరించాలి.

 

పెద్ద వాళ్ళు చాలా మంది వ్యాక్సిన్ ని వేయించుకున్నారు కానీ చిన్న పిల్లలు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. అయితే ఆరోగ్య నిపుణులు ఈ రోజు పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే విషయం గురించి చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీరు పబ్లిక్ లో ఉండే విధానం బట్టి మీ పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అందుకని మీరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శుభ్రంగా ఉండడం ఇలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
అలానే ఇంటికి రాగానే మీ పిల్లలని ముట్టుకోకుండా చేతులు కాళ్ళు కడుక్కుని అప్పుడు మాత్రమే మీ పిల్లల దగ్గరికి వెళ్ళండి.
ఒకవేళ కనుక మీ ఆరోగ్యం బాగోక పోతే మీ పిల్లల నుంచి దూరంగా వచ్చేయండి.
అలాగే మీ ఆరోగ్యం బాగోకపోతే ఇంట్లో కూడా మాస్కులు ధరించండి.

కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చాలా మంది లో ఆందోళన కలుగుతోంది. అయితే ఇంకా పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకోండి అలానే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఇలా వీలైనంతవరకు సేఫ్ గా ఉంటూ కరోనా వైరస్ బారిన మీ పిల్లలు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version