మీకు పీఎఫ్ ఖాతా ఉందా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తాజాగా పీఎఫ్ సబ్‌స్క్రైబర్లను అలెర్ట్ చేయడం జరిగింది. కనుక పీఎఫ్ ఖాతా కలిగి వున్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO తాజాగా పీఎఫ్ సబ్‌స్క్రైబర్లను అలర్ట్ చేసింది.
మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. లేదు అంటే ఇబ్బందులు తప్పవు అని అంది. ఈ మధ్య కాలం లో మోసాలు ఎక్కువై పోతున్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం దీని పైనే EPFO పీఎఫ్ సబ్‌స్క్రైబర్లను అలర్ట్ చేసింది. అయితే ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత వివరాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దని అంది.
అలానే ఆధార్ కార్డు నెంబర్, పాన్ కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్, యూఏఎన్, ఓటీపీ వంటి వివరాలను ఫోన్ కాల్‌లో ఎవ్వరికీ చెప్పొద్దని కూడా అంది. లేదు అంటే మీరు మీ డబ్బుల్ని నష్ట పోవాల్సి ఉంటుంది అని తెలుసుకోండి. ఈపీఎఫ్‌వో ఎప్పటికీ సబ్‌స్క్రైబర్ల ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంక్ అకౌంట్, ఓటీపీ వివరాలను కోరదని స్పష్టతనిచ్చింది. అలాగే డబ్బులు డిపాజిట్ చేయాలని ఈపీఎఫ్‌వో ఎవ్వరినీ అడగదు అని కూడా చెప్పింది. ఇలా ఎవరైనా కాల్ లేదా మెసేజ్ చేస్తే.. వాటికి స్పందించవద్దని ఈపీఎఫ్‌వో PF సబ్‌స్క్రైబర్లను కోరింది. కనుక అప్రమత్తంగా ఉండాలి. లేదు అంటే డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది.