మోడీ ఓ దృతరాష్ట్రుడు… బీజేపీ నేతలకు సిగ్గు లేదు : జగ్గారెడ్డి

యూపీలో జరిగిన సంఘటన పై బిజేపి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ యూపీ కి వెళ్లేందుకు అనుమతించడం లేదని.. అణిచి వేయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించడానికి వెళ్తే తప్పేంటి..? దురదృష్టవశాత్తు.. ప్రభుత్వం చంపిన రైతు కుటుంబాల ను పరామర్శ కి వెళ్ళిన ప్రియాంక ను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

మోడీ దృతరాష్ట్రుడు లా మారిపోయాడని.. తన మంత్రులు రైతులను చంపితే చూస్తూ ఉన్నాడే కానీ చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. యూపీ లో చనిపోయిన కుటుంబాలను ప్రియాంక గాంధీ నీ పరామర్శించే అవకాశం ఇవ్వాలని.. లేదంటే సంగారెడ్డి నుండే ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు.

కరీంనగర్ లో బండి సంజయ్ ని చెంప మీద కొట్టినా చర్యలు తీసుకో లేని ప్రభుత్వం బిజేపిదని ఎద్దేవా చేశారు. కెసిఆర్..అమిత్ షా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే బీజేపీ నాయకులకు సిగ్గు లేదా..? సిగ్గు లేకుండా గాంధీ భవన్ మీద దాడి చేస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజేపి నేతలకు గాంధీ భవన్ తాకే దమ్ముందా ? అని సవాల్ విసిరారు. యుపి లో బిజేపి ప్రభుత్వం రైతులను చంపితే… తెలంగాణలో భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్లి బండి సంజయ్ ఏం మొక్కడాని ప్రశ్నించారు. . అక్కడ మేము రైతులను చంపాం..ఇక్కడ క్షమించు అని అడిగినవా ..? అని మండిపడ్డారు. బీజేపీ, టిఆర్ఎస్, వైసీపీ లు దాగుడు మూతలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు.