రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఆ ట్రైన్లు రద్దు

-

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. భారతదేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదమైన బాలాసోర్‌ ఘటన జరిగిన తర్వాత.. ఏ ట్రైన్ రద్దయిందో.. ఏ ట్రైన్ నడుస్తుందో క్లారిటీ లేకుండా పోయింది. ఘోర ప్రమాదం కారణంగా చాలా వరకు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే.. ఆ రైల్వే ట్రాక్ పూర్తిగా సిద్ధమయ్యే వరకు ఆ రూట్‌లో నడిచే రైళ్లన్నింటినీ రైల్వే శాఖ రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-నాందేడ్ (07853) రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా డౌండ్-నిజామాబాద్, ముద్ఖేడ్-నిజామాబాద్ (11409) రైలును రేపటి నుండి 13వ తేదీ వరకు రద్దు చేస్తుండగా…నిజామాబాద్-పంధర్పూర్, నిజామాబాద్-ముద్ఖేడ్ (01413) రైలును గురువారం(ఈనెల 8 వ తేదీ) నుండి 14 వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు రద్దైన రైలు వివరాలను గమనించాలని సూచించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version