ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్..ఆ సంస్థలలో ఉద్యోగాలు..వివరాలు..

-

ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్..ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు సంబంధించిన ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే..కియా మోటార్స్ తో పాటు మరో రెండు సంస్థల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు పెనుగొండలో జాబ్ మేళాను నిర్వహించనున్నారు..

ఖాళీలు, పూర్తీ వివరాలు..

కియా మోటార్స్ లో ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది..

Seoyon E-Hwa Summit: ఈ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది…ఇందుకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు..

Vinuthna Fertilizers: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు శ్రీ సత్యసాయి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.దీనికి కూడా పురుషులు మాత్రమే అప్లై చేసుకొవాలి.

పూర్తీ వివరాలు..

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు P.S Govt. Degree College, Near Railway Station, Penygonda, Sri Sathya Sai District చిరునామాలో ఈ నెల 22 ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఆసక్తి కలిగిన వాళ్ళు పూర్తీ సమాచారం తెలుసుకొని అప్లై చేసుకొవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version